ఆలిండియా సివిల్ సర్వీస్ బదిలీలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.13 మంది అధికారుల క్యాడర్ కేటాయింపుపై ఒక్కొక్కరి పిటిషన్ పై విచారణ చేసింది.
సోమేశ్ కుమార్ పై ఇచ్చిన తీర్పు తమకు వర్తించదని బ్యూరోక్రాట్స్ తెలిపారు.ఈ క్రమంలో తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యాడర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర విభజన తరువాత 14 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీ, తెలంగాణకు కేంద్రం కేటాయించింది.
ఈ క్రమంలో కేంద్ర ఉత్తర్వులపై క్యాట్ ను ఆశ్రయించిన కొందరు సివిల్ సర్వీస్ అధికారులు తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం.
ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే.