నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ ( Mrinal Thakur )హీరోయిన్ గా రూపొందిన హాయ్ నాన్న సినిమా( hi nannna movie ) ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.హీరో గా నాని కి కమర్షియల్ బ్లాక్ బస్టర్ దక్కి చాలా కాలం అయింది.
అందుకే ఈ సినిమా తో ఆయన కమర్షియల్ గా దక్కించుకోబోతున్నాను అంటూ చాలా నమ్మకంగా చెబుతున్నాడు.రెండు నెలల నుంచి కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా తిరుగుతూనే ఉన్నాడు.
నాని( nani ) మరియు మృణాల్ లు ఈ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నారు.ఇక ఈ సినిమా కోసం నాని చేస్తున్న ప్రమోషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.ఆ మధ్య యానిమల్ సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో నాని వెళ్లి ఆ సినిమా యూనిట్ తో కలిసి చిట్ చాట్ చేసి యానిమల్ కి ప్రమోషన్ చేస్తూనే తన హాయ్ నాన్న సినిమా కు ప్రమోషన్ చేసుకున్నాడు.ఇప్పుడు వెంకటేష్ తో కలిసి నాని ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ వీడియో లో హాయ్ నాన్న సినిమా ను ప్రమోట్ చేసుకోవడం తో పాటు వెంకీ యొక్క సైంధవ్ సినిమా( Saindhav movie ) ను కూడా ప్రమోట్ చేయడం జరిగింది.
ఇలాంటి విభిన్నమైన ఆలోచన నానికి రావడం నిజంగా అభినందనీయం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో సినిమా పై అంచనాలు పెంచుతుంది అనడం లో సందేహం లేదు.మొత్తానికి నాని తన సినిమా కోసం పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.
నాని కోసం అయినా హాయ్ నాన్న సినిమా హిట్ అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.నాని ఈ సినిమా తో కచ్చితంగా కమర్షియల్ బిగ్ సక్సెస్ దక్కించుకుంటే కనుక మంచి వసూళ్లు దక్కడం ఖాయం.