తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను( Taapsee Pannu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసి అక్కడ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది.
ఇక మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చింది.ఆ తర్వాత వస్తాడు నా రాజు , గుండెల్లో గోదారి, దరువు, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, షాడో, సాహసం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది తాప్సి.

ఇకపోతే తాప్సీ పన్ను చివరగా తెలుగు ప్రేక్షకులను మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలుసిందే.ప్రస్తుతం బాలీవుడ్( Bollywood ) లో పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే చాలా కాలం తర్వాత తాప్సీ సోషల్ మీడియాలో అభిమానులతో నెటిజన్స్ తో ముచ్చటించింది.ఇందులో బాగా చిట్ చాట్ నిర్వహించడంతో ఒక నెటిజన్ తాప్సిని ప్రశ్నిస్తూ మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా.
ఎందుకు తాప్సీ వంకాయ టింకరగా సమాధానం చెప్పింది.నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు కాబట్టి అతి త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పుకొచ్చింది.

నెటిజన్ పెళ్లి విషయం గురించి ప్రస్తావించగా ఆమె ప్రెగ్నెంట్ విషయం గురించి మొదట మాట్లాడి ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడింది.దీంతో ఆమె చేసిన కామెంట్ పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తాప్సీ ప్రస్తుతం ప్రెగ్నెంటా, లేకపోతే ఆమె పెళ్లి విషయం గురించి కాకుండా ప్రెగ్నెంట్ విషయం గురించి ఎందుకు ప్రస్తావిస్తుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
మరి ఈ విషయంపై తాప్సీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కొందరు నెటిజన్స్ తాప్సీ స్పందించిన తీరును చూసి ఆమె ఇండైరెక్టుగా ఇలియానా( Ileana ) ప్రెగ్నెన్సీ పై అలాంటి కామెంట్స్ చేసిందని ఆమెను ఉద్దేశించి ఇలా కామెంట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.