నన్ను దెయ్యం, భూతం అని పిలిచినా పొగడ్తగానే భావిస్తా.. శృతి హాసన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు.

 Heroine Shruti Haasan Comments Goes Viral In Social Media Details Here , Shruti-TeluguStop.com

అయితే శృతి హాసన్ ( Shruti Haasan )లుక్స్ విషయంలో అప్పుడప్పుడూ నెగిటివ్ కామెంట్లు వినిపిస్తుంటాయి.ఆ కామెంట్లకు సైతం శృతి తనదైన శైలిలో జవాబు ఇస్తున్నారు.

Telugu Salaar, Chiranjeevi, Prabhas, Shruti Haasan-Movie

న్ను దెయ్యం, భూతం అని పిలిచినా పొగడ్తగానే భావిస్తానని తాజాగా శృతిహాసన్ కామెంట్లు చేశారు.అందరూ అందరికీ నచ్చరని ఆమె చెప్పుకొచ్చారు.నాకు నలుపు రంగు అంటే ఇష్టమని శృతి హాసన్ చెబుతున్నారు.సోషల్ మీడియాలో సైతం శృతి హాసన్ ఎక్కువగా ఆ రంగు దుస్తుల్లోనే కనిపిస్తుండటం గమనార్హం.డ్రెస్ విషయంలో వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ శృతి హాసన్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

Telugu Salaar, Chiranjeevi, Prabhas, Shruti Haasan-Movie

ఒక మహిళా ఆర్టిస్ట్ పొగడ్తలు మాత్రమే కాదని అప్పుడప్పుడూ విమర్శలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని శృతి కామెంట్లు చేశారు.ఇతరుల అభిప్రాయాలకు బాధ పడటం, భయపడటం చేయనని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.నాకు మొదటినుంచి నలుపు రంగు, లోహ ఆభరణాలు ధరించడం అంటే ఇష్టమని ఆమె పేర్కొన్నారు.

మెటల్స్ ను కేవలం సంగీతంపై ఇష్టం ఉన్నవారు మాత్రమే ధరించరని శృతి చెప్పుకొచ్చారు.

Telugu Salaar, Chiranjeevi, Prabhas, Shruti Haasan-Movie

అవి నాలో శక్తిని రెట్టింపు చేస్తాయని ఆ ఆభరణాలు నచ్చని కొంతమంది దెయ్యంలా ఉన్నావని కామెంట్ చేస్తుంటారని అలాంటి ట్రోల్స్ ను నేను పెద్దగా పట్టించుకోనని శృతి హాసన్ వెల్లడించారు.శృతి హాసన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.శృతి హాసన్ రెమ్యునరేషన్( Remuneration ) ప్రస్తుతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.

త్వరలో శృతి హాసన్ మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube