టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల చేతిలో ప్రస్తుతం పది సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.పవన్ కు, మహేష్ కు జోడీగా శ్రీలీల చేతిలో ఆఫర్లు ఉన్నాయి.
బాలయ్య కూతురిగా కూడా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే.చేతిలో ఈ స్థాయిలో ఆఫర్లు ఉన్నా శ్రీలీల పారితోషికం మాత్రం పెద్దగా పెరగలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
శ్రీలీల పారితోషికం కేవలం కోటిన్నర రూపాయలు అని సమాచారం.ఈ మొత్తం కూడా ఎక్కువేనని కొంతమేర తగ్గించుకోవాలని కొందరు నిర్మాతలు శ్రీలీలను కోరారని సమాచారం.అయితే శ్రీలీల మాత్రం తాను పారితోషికంను మాత్రం తగ్గించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని తెలుస్తోంది.శ్రీలీల ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం ఆమె పారితోషికం 3 నుంచి 4 కోట్ల రూపాయలకు చేరే అవకాశాలు అయితే ఉన్నాయి.
హీరోలు రెమ్యునరేషన్ ను ఊహించని రేంజ్ లో పెంచినా సైలెంట్ గా ఉన్న నిర్మాతలు హీరోయిన్లు కొంతమేర పారితోషికాన్ని పెంచినా ఆఫర్లు ఇవ్వడం లేదు.శ్రీలీల హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను అందుకున్నా ఆమె పారితోషికం ఆశించిన రేంజ్ లో పెరగలేదు.రాబోయే రోజుల్లో శ్రీలీల ఎక్కువ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తారేమో చూడాలి.యాడ్స్ ద్వారా కూడా ఈ బ్యూటీకి భారీగా ఆదాయం చేకూరుతోంది.
టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం శ్రీలీల మాయలో ఉన్నారు.యావరేజ్ సినిమాలను సైతం తన టాలెంట్ తో హిట్ చేయడం వల్లే శ్రీలీలకు ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కుతోంది.హీరోయిన్ శ్రీలీల షిఫ్ట్ లలో పని చేస్తే మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయడం సాధ్యమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.