ఆ సమస్యలు రావడం నిజమే.. అసలు విషయం చెప్పిన శ్రుతి హాసన్

భారత నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Heroine Shruthi Hasan Comments On Strain Due To Covid Details, Shruti Haasan, T-TeluguStop.com

నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయమయ్యింది.ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.

తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక శృతి హాసన్ కు కథ చిన్నది, పెద్దది అని తేడా లేకుండా కథ నచ్చితే వెంటనే ఒప్పుకుంటుంది.

ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది.ఇక తన తండ్రి నటించిన సినిమాలో కూడా ఓ పాటను పాడి వినిపించింది.

Telugu Salaar, Problem, Shruthi Hasan, Kamal Hasan, Prabhas, Shruthihasan, Shrut

బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికా తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

Telugu Salaar, Problem, Shruthi Hasan, Kamal Hasan, Prabhas, Shruthihasan, Shrut

అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.గతంలో కోవిడ్ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యింది శృతిహాసన్.ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని పంచుకుంది.అందులో తన ఫోటోను పంచుకుంటూ.ఆ ఫోటోకు కోవిడ్ అలసట సమస్య రావడం నిజమంటూ అసలు విషయాన్ని తెలిపింది.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Telugu Salaar, Problem, Shruthi Hasan, Kamal Hasan, Prabhas, Shruthihasan, Shrut

ఇక శృతి హాసన్ గతంలో తన వ్యక్తిగత విషయం పట్ల సినిమాలకు దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.ఇక ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది.ఇక తెలుగులో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుండగా.ఇందులో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్నాడు.

అంతే కాకుండా మరో సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube