సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో వరుస ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు.సినిమా రంగంలో తను సక్సెస్ కావడం గురించి రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యానిమల్ సినిమా( Animal Movie )తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రష్మిక రాబోయే రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.తాజాగా రష్మిక మాట్లాడుతూ నాకంటే అందం, ప్రతిభ ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారని తనకు తెలుసని కామెంట్లు చేశారు.
నాకు మంచి ఆఫర్లు రావడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.అందుకు నేను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానని రష్మిక చెప్పుకొచ్చారు.
లైఫ్ లో సంతోషాన్ని మీరు పొందిన ఆనందాన్ని సాధారణంగా భావించరాదని ఆమె కామెంట్లు చేశారు.
గత కొంతకాలంగా నేను నేర్చుకున్నది ఇదేనని రష్మిక( Rashmika Mandanna ) కామెంట్లు చేశారు.ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో యానిమల్ కంటే పెద్ద హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమాతో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్( The Girl Friend ), చావ అనే సినిమాలలో ఆమె నటిస్తున్నారు.
ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రష్మిక రెమ్యునరేషన్( Rashmika Remuneration ) పరంగా కూడా టాప్ లో ఉన్నారు.
4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రష్మిక పారితోషికం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే రష్మిక మాత్రం తన రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని చెబుతున్నారు.కెరీర్ పరంగా కూడా రష్మిక టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.రష్మిక ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.