దేవి సినిమా లో ప్రేమను చుసిన వారంతా ఆమె నటనకు ఫిదా అవ్వకుండా ఉంటారా.? ఇది డబ్బింగ్ సినిమా అయినా ధర్మ చక్రం సినిమా ద్వారా తెలుగు లో నేరుగా తొలిసారి నటించింది.చిన్న తనం నుంచి స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టపడ్డ ప్రేమ అనుకోకుండా అవకాశం రావడం తో కన్నడ లో తొలుత హీరోయిన్ అయ్యింది.ఆమె రెండవ సినిమా ఓం. ఈ సినిమాకు హీరో మరియు దర్శకుడు ఉపేంద్ర.ఈ చిత్రం ఘనవిజయం సాధించడం తో ప్రేమకు కన్నడ సినిమా ఇండస్ట్రీ బ్రహ్మరథం పట్టింది.
ఆ తర్వాత తెలుగులో సైతం ఆమె హావ కొన్నాళ్ళు నడిచింది.
అయితే ఆమె తెలుగు లో అనేక సినిమాల్లో నటించిన అవి మెయిన్ లీడ్ కాకపోవడం తో ఆమెకు రావాల్సినంత ఫెమ్ రాలేదు అనే చెప్పాలి.
ప్రేమ సినిమాల విషయంలో అంత కాంట్రవర్షియల్ కాకపోయినా వ్యక్తి గత జీవితం కొంత వివాదాలతో నడించింది.ఇక ప్రేమ 2009 వరకు బిజీ గా నటిస్తూనే ఉంది.
ఆ తర్వాత ఒక ఎన్నారై ని పెళ్లి చేసుకొని సెటిల్ అయినా, ఈ జంటకు అయితే సంతానం కలగలేదు.ఇక కారణాలు ఏంటో తెలియదు కానీ కొన్నేళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత విడాకులు తీసుకొని ప్రేమ ఇండియాకు తిరిగి వచ్చింది.
ఇక మళ్లి సినిమాల్లో బిజీ అయ్యింది.

ఓం సినిమా టైం లో తాను అనుభవించిన బాధను ఒక మీడియా సంస్థతో పంచుకుంది ప్రేమ. ఈ సినిమా డైరెక్టర్ అయినా ఉపేంద్ర తనను ఎంతగానో వేధించాడని, అతడికి ఆడవాళ్లంటే అసహ్యమని, మానవత్వం లేకుండా వ్యవహరించడం ఉపేంద్ర నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే ఈ విషయాలపై ఉపేంద్ర సైతం స్పందించాడు.
తాను ఆ సమయంలో ప్రవర్తించిన తీరు పట్ల ప్రేమ ఎంతో బాధ పడి ఉండవచ్చు అని, ఆమె తనను ద్వేషించడం లో కూడా తప్పు లేదంటూ చెప్పుకోచ్చాడు.ఒకానొక సమయంలో షూటింగ్ లో రంగులు నేరుగా ప్రేమ కళ్ళల్లో చల్లడం వల్ల ఆమె ఎంతో ఇబ్బందికి గురయ్యిందట.







