చరణ్‌కు ఇంకా కుదర్లేదట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్‌ను కరోనా కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే చిరంజీవికి కరోనా వచ్చిందనే వార్తతో ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా వేశారు.కానీ ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను ఇతర నటీనటులతో కానిచ్చేస్తున్నారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడనే వార్త ఇప్పటికే ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కానీ ఆ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Advertisement

గతంలో చరణ్ సరసన కియారా అద్వానీ, రష్మిక మందన లాంటి పేర్లు ఎక్కువగా వినిపించాయి.కానీ వారిని ఈ సినిమాలో ఓకే చేసినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో, ఈ సినిమాలో చరణ్ సరసన ఎవరు నటిస్తారా అనే అంశం ఇంకా మిస్టరీగా మారింది.

అయితే ఆచార్య చిత్రంలో చరణ్ పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని, ఆయన సరసన హీరోయిన్ పాత్ర కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది.దీంతో అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే బ్యూటీని ఈ పాత్ర కోసం తీసుకోవాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?
Advertisement

తాజా వార్తలు