చూడగానే తెలుగుదనం ఉట్టిపడే హీరోయిన్స్ ని మన టాలీవుడ్ లో చూడడం ఈమధ్య చాలా అరుదు అయిపోయింది.ఉన్న తెలుగు అమ్మాయిలు కూడా స్టైల్ కి పోయి ఇంగ్లీష్ లో మాట్లాడడం, వెస్ట్రన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు.
కానీ ఒకప్పుడు కొంతమంది హీరోయిన్స్ ని చూస్తే చూడడానికి ఎంత ముచ్చటగా, సంసారం పక్షంగా ఉంది, ఇలాంటి అమ్మాయిని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ప్రతీ ఒక్కరు అనుకునే రేంజ్ లో ఉంటారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు లయ.
( Heroine Laya ) హీరో వేణు తొట్టెంపూడి తొలిసినిమా ‘స్వయంవరం’( Swayamvaram ) చిత్రం తోనే ఈమె కూడా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఈ సినిమా తర్వాత ఈమె చేసిన సినిమాలలో ఎక్కువ శాతం సూపర్ సక్సెస్ సాధించినవే ఉన్నాయి.
అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే గణేష్( Ganesh ) అనే అతన్ని పెళ్ళాడి సినిమాలకు దూరం అయ్యింది.
దాదాపుగా 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లయ, ఒక్క చిత్రం లో కూడా నటనకి ప్రాధాన్యత లేని పాత్రలో నటించలేదు.పొట్టి దుస్తులు వేసుకొని హీరోల పక్కన ఎగరడం వంటివి కూడా చెయ్యలేదు.ఇంత పద్దతి గల తెలుగు హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు.
చాలా కాలం తర్వాత ఈమె శ్రీను వైట్ల మరియు రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’( Amar Akbar Anthony ) అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.ఇందులో ఆమెతో పాటుగా ఆమె కూతురు కూడా నటించింది.
ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె కనిపించలేదు.కానీ ఈమధ్య కాలం లో ఎక్కువగా ఆమె ఇంటర్వ్యూస్ ఇవ్వడం, టీవీ షోస్ లో పాల్గొనడం వంటివి చేస్తుంది.
ఏమైంది సడన్ గా ప్రత్యక్షం అయ్యింది లయ అని అందరూ అనుకున్నారు.
అలా ఆమె అకస్మాత్తుగా ప్రత్యక్షం అవ్వడానికి కారణం సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నాను అని చెప్పడానికే.అలాగే ఆమెకి అవకాశాలు వస్తున్నాయి కూడా, ఇప్పుడు రీసెంట్ గా నితిన్( Nithin ) మరియు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘తమ్ముడు’( Thammudu ) అనే చిత్రం లో లయ ఒక ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధమైంది.రీసెంట్ గానే ఆమె ఈ సినిమా లొకేషన్స్ లో కనపడింది.
ఇందులో ఆమె ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తుందని, ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో మళ్ళీ బిజీ అవుతుందనే నమ్మకంతో ఉందట లయ.చూడాలి మరి ఈ చిత్రం తర్వాత ఆమె ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.