మాకు పెట్రోల్ ఉచితంగా దొరకలేదు... కేటీఆర్ కు ట్వీట్ చేసిన డింపుల్ హయతి!

సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ సక్సెస్ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి నటి డింపుల్ హైయతి (Dimple Hayathi)ఈ మధ్యకాలంలో వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.గత రెండు రోజుల క్రితం డిసిపి రాహుల్ హెగ్డే(Rahul Hedge) తో ఈమెకు గొడవ అయిన విషయం మనకు తెలిసిందే.

 Heroine Dimple Hayathi Sensation Tweet To Minister Ktr Details, Dimple Hayathi,r-TeluguStop.com

అయితే ఈమె పై కేసు నమోదు చేసిన రాహుల్ హెగ్డే పట్ల ఈమె కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగానే మరోసారి హైదరాబాద్ ట్రాఫిక్(Traffic) గురించి ఈమె చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది.

హైదరాబాద్ ట్రాఫిక్ దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసింది.ఈ ట్వీట్ ఏకంగా తెలంగాణ సీఎంవో అలాగే మంత్రి కేటీఆర్ కి( KTR ) కూడా ట్యాగ్ చేయడంతో డింపుల్ హయాతీ డేరింగ్ కి జనాలు షాక్ అవుతున్నారు.  హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ కి కోల్డ్ వార్ నడుస్తుంది.ఆయన్ని టార్గెట్ చేస్తూ డింపుల్ ఈ తరహా ట్వీట్ చేశారనీ తెలుస్తుంది.ఈ సందర్భంగా ఈమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇంటికి వెళ్లాలి అంటే గంటల సమయం పడుతుంది.

ఎమర్జెన్సీ అయితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.ట్రాఫిక్ డిసిపి ఎక్కడ? అసలు హైదరాబాదులో కాలు బయట పెట్టగలమా? ప్రభుత్వ ప్రతినిధులారా మాకు పెట్రోల్ ఉచితంగా రాలేదు అంటూ ట్రాఫిక్ గురించి ఈమె ట్రాఫిక్ డిసిపిని ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ కి కూడా ట్యాగ్ చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది.

మరి ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ పై ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే, మంత్రి కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube