ఆ హీరోలు అమ్మాయిలను ట్రాప్ చేస్తారు.. అర్చన సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు ఉన్నా కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని హీరోయిన్లలో ఒకరైన అర్చన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కొంతమంది హీరోల గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

రాధా గోపాళం మూవీలో ఛాన్స్ మిస్సైందని ఒక సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయడం వల్ల నాకు హీరోయిన్ ఛాన్స్ పోయిందని అర్చన తెలిపారు.ఆ తర్వాత ఇండస్ట్రీ అంటే ఏంటో నాకు అర్థం అయిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో నటించి ఉంటే నా గ్రాఫ్ అద్భుతంగా ఉండేదని అర్చన పేర్కొన్నారు.కొంతమంది క్యారెక్టర్స్ చేసి హీరోగా సక్సెస్ అయ్యారని నేను అలా కాలేదని ఆమె తెలిపారు.

తెలుగు వాళ్లు నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఇంకా ఆఫర్లు రావాలని చెబుతున్నారని అర్చన అన్నారు.యమదొంగలో ఛాన్స్ అంటే అది మంచి ప్రాజెక్ట్ అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

యమదొంగ మూవీ ప్లస్ అని అర్చన కామెంట్లు చేశారు.ప్రస్తుతం వెరైటీ రోల్స్ వస్తున్నాయని అర్చన అన్నారు.రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర నాకు నచ్చిందని ఆమె తెలిపారు.

ఒక అమ్మాయి వీక్ గా ఉంటే ఆ అమ్మాయి మైండ్ క్యాప్చర్ చేయడానికి చాలామంది ఉంటారని అర్చన అన్నారు.ఒక హీరో నాకు తెలీకుండా నా గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.ఒక హీరోది వంకరబుద్ది అని అర్చన తెలిపారు.

ఎవరి సపోర్ట్ లేని అందంగా ఉన్న అమ్మాయిలను కొంతమంది హీరోలు ట్రాప్ చేస్తారని అర్చన వెల్లడించారు.మనకు ఏది గుడ్ అనేది ఏది బ్యాడ్ అనేది మనకే తెలుస్తుందని అర్చన పేర్కొన్నారు.నాకు తల్లీదండ్రుల సపోర్ట్ ఉందని అర్చన తెలిపారు.అర్చన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు