మగధీర మూవీని మిస్ చేసుకుని బాధపడుతున్నా.. అర్చన కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో అర్చన ఒకరనే సంగతి తెలిసిందే.హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అర్చన నటించిన సినిమాలు తక్కువే అయినా ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.2019 సంవత్సరం నవంబర్ నెలలో అర్చన జగదీష్ భక్తవత్సలం అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత అర్చన, జగదీష్ అన్యోన్యంగా ఉన్నారు.

 Heroine Archana Shocking Comments About Magadheera Movie Goes Viral , Archana ,-TeluguStop.com

తాజాగా అలీతో సరదాగా షోకు అర్చన, జగదీష్ కలిసి హాజరయ్యారు.

కమాన్ కమాన్ కళావతి పాటకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అర్చన, జగదీష్ అలీతో సరదాగా షోలోకి ఎంట్రీ ఇచ్చారు.

శ్రీ రామదాసు సినిమాలో సీత పాత్రలో నటించే సమయానికి నాకు వయస్సు కూడా లేదని అర్చన కామెంట్లు చేశారు.రాఘవేంద్రరావు గారితో కలిసి పని చేయడం సాధారణ విషయం కాదని ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉందని అర్చన చెప్పుకొచ్చారు.

సర్ప్రైజ్ లన్నీ ముందుగా తెలిసిపోతాయని నా కళ్లముందు నుంచి చేస్తూ ఉంటారని అర్చన కామెంట్లు చేశారు.

మ్యారేజ్ వెన్యూ మార్చడం గురించి అర్చన స్పందిస్తూ ఇలాంటి కోతి ఐడియాలు ఇద్దరికీ ఒకటేసారి వస్తాయని అన్నారు.

బాలయ్య బాబుకు పాండురంగడు సినిమాలో కొరియోగ్రఫీ నేర్పించానని అర్చన తెలిపారు.మగధీర సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయడం తన తప్పేనని ఆ సమయంలో బ్రెయిన్ చిన్నదని తనకు లౌక్యం తక్కువని ఆమె కామెంట్లు చేశారు.

ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ పెరిగిందని అర్చన తెలిపారు.

బల్లి అంటే నాకు చాలా భయమని మా ఇద్దరిలో నేనే రొమాంటిక్ అని అర్చన చెప్పుకొచ్చారు.ఇద్దరిలో అబద్ధాలు ఎవరు చెబుతారంటే నేనే అని జగదీష్ అన్నారు.ఇప్పుడు అకౌంట్స్ అంతా నా దగ్గరే అని భర్త నుంచి లాగేసుకోలేదని భర్తే ఇవ్వాల్సి వచ్చిందని అర్చన చెప్పుకొచ్చారు.

పెద్ద సినిమాలలో అవకాశం ఇచ్చి లాస్ట్ మూమెంట్ లో డ్రాపైన సినిమాలు ఉన్నాయా అనే ప్రశ్నకు అర్చన ఎమోషనల్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube