శాండల్ వుడ్ స్టార్ హీరో యష్( KGF Hero Yash ) గురించి మనందరికీ తెలిసిందే.కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు యష్.
ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఏంటి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.కేజిఎఫ్ సినిమా తర్వాత అభిమానులు చాలామంది యష్ ని రాఖీ బాయ్( Rocky Bhai ) అనే ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు.
కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపును తెచ్చుకున్నాడు యష్.కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు.
కేజీఎఫ్ మూవీ( KGF ) తర్వాత యష్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.ఇది ఇలా ఉంటే తాజాగా యష్ లగ్జరీ కారు కొనుగోలు చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొనుగోలు చేసిన ఆ కారు గురించే అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా యష్ ఒక ఖరీదైన ల్యాండ్ రోవర్( Land Rover ) కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనగోలు చేశాడు యష్.కాగా ఈ కారు ఖరీదు సుమారు రూ.4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.భారతీయ మార్కెట్లో బడా వ్యాపారులు, సినీ తారలు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లలో రేంజ్ రోవర్( Range Rover ) ఒకటి.
ఇది అత్యాధునిక ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.ఈ కారుతో పాటు ఇప్పటికే యష్ వద్ద మెర్సిడెస్ బెంజ్ డీఎల్ఎస్ 350 డి, ఆడి క్యూ 7, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్, మెర్సిడెస్ జీఎల్‌సి 250 డి కూపే లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అందులో యష్ తో పాటు ఆయన భార్యా పిల్లలు కూడా ఉన్నారు.చాలామంది అభిమానులు నెటిజన్స్ యష్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.