సరిహద్దు దాటిన ప్రేమ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన యశ్?

గత నాలుగు సంవత్సరాల నుంచి సౌత్ ఇండియా సినిమాలు భారతీయ చిత్ర పరిశ్రమను శాసిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి సినిమాను మొదలుకొని నేడు త్రిబుల్ ఆర్ ,పుష్ప, కేజిఎఫ్ 2 వంటి చిత్రాల వరకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి.

ఇకపోతే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా ద్వారా నటుడు ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.యశ్ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

తాజాగా నటుడు తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ హాలిడే వెకేషన్ వెళ్లారు.అయితే ఇటలీలో తనని గుర్తించిన అభిమానులు పెద్ద ఎత్తున తనను కలిసి తనతో ఫోటోలు దిగారు.

అయితే యశ్ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా యశ్ స్పందిస్తూ.

Advertisement

నాపై మీ ప్రేమ సరిహద్దులు దాటిపోయింది అంటూ క్యాప్షన్ జోడించారు.

ఇలా మీరు చూపిస్తున్న ప్రేమను ముక్తకంఠంతో అంగీకరిస్తున్నాను.ఇలా ఇటలీ బాంగ్లాదేశ్ నుంచి నన్ను కలవడానికి వచ్చిన అభిమానులకు చాలా ధన్యవాదాలు ఈ ఫోటో నాకు ఎంతో ప్రత్యేకం అంటూ తన అభిమానులతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇకపోతే ఈ ఫోటోలో యశ్ భార్య రాధిక ఉండడం గమనార్హం.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు