హీరో అర్జున్ తో విభేదాలపై మరో సారి స్పందించిన విశ్వక్.... ఏమన్నారంటే?

Hero Vishwaksen Response On Arjun Controversy,Arjun, Vishwaksen,Das Ki Dhamki,Controversy,Film Chamber,Aishwarya,Tollywood

ఇండస్ట్రీలో నటుడిగా విభిన్న కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి వారిలో నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు.తాజాగా ఈయన నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ( Das Ka Dhamki ).

 Hero Vishwaksen Response On Arjun Controversy,arjun, Vishwaksen,das Ki Dhamki,co-TeluguStop.com

ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విశ్వక్ కు విలేకరుల నుంచి ఊహించని ప్రశ్న ఎదురయింది.

గతంలో ఈయన సీనియర్ హీరో అర్జున్ (Arjun) దర్శకత్వంలో తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా విశ్వక్ హీరోగా ఓ సినిమా చేయాలని బావించారు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నింటినీ జరుపుకొని షూటింగుకు ముందు కొన్ని కారణాలవల్ల ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా కారణంగా అప్పట్లో అర్జున్(Arjun) విశ్వక్(Vishwak) మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం నడిచింది.ఇక ఈ సినిమా వివాదం అప్పటితో ముగిసిపోయింది.అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వివాదం తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలోనే విలేకరి అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఆగిపోయిన తర్వాత మీరు హీరో అర్జున్ కు తిరిగి డబ్బు చెల్లించారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు విశ్వక్ సమాధానం చెబుతూ… ఆ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం అసలు కాదు.అందుకే ఈ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు.

ఈ సినిమాకు ఆ సినిమాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అంతేకాకుండా కొందరిపై ఉన్న గౌరవంతో నేను ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడదలచుకోలేదంటూ ఈయన అర్జున్ తో చేయాల్సిన సినిమా గురించి మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు.ఇలా విశ్వక్ అర్జున్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Hero Vishwaksen Response On Arjun Controversy,Arjun, Vishwaksen,Das Ki Dhamki,Controversy,Film Chamber,Aishwarya,Tollywood - Telugu Aishwarya, Arjun, Controversy, Das Ka Dhamki, Das Ki Dhamki, Chamber, Tollywood, Vishwak, Vishwaksen #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube