నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల( MLC Elections ) విజయంపై టిడిపి ( TDP ) కూడా పూర్తిస్థాయి నమ్మకంతో లేదని వార్తలు వినిపించాయి.వైసీపీ ప్రభుత్వం అన్నిఅస్తాలను ప్రయోగించిందని.
,అర్హత లేని వాళ్ళకి కూడా ఓట్లు పుట్టించి అక్రమాలకు పాల్పడిందని కూడా తెలుగుదేశం నాయకత్వం అనేక ఆరోపణలు చేసింది .నిజంగా ఎన్నికలలోవైసిపి గెలిస్తే , వైసిపి న్యాయబద్ధంగా గెలవలేదని హడావుడి చేయడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వంఅస్త్రాలను సిద్ధo చేసుకుంది .అయితే అనూహ్యంగా ఆ పార్టీ మూడు చోట్ల భారీ మెజారిటీతో గెలవడం ఆ పార్టీకి ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలగజేసింది.అదే ఆనందంలో ఇప్పుడు కాస్త అతిశయంతో కూడిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ నేతలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇక జగన్ ( Jagan ) ప్రభుత్వం పని పూర్తయిపోయిందని, జగన్ పతనం మొదలైంది అంటూ ఆ పార్టీ నేతలు మీడియాకు ఎక్కి హడావిడి చేస్తున్నారు.అయితే వారు చెబుతున్నంత ప్రజా వ్యతిరేకత జగన్ ప్రభుత్వం పై ఉందా లేదా అన్నది సార్వత్రిక ఎన్నికల్లో కానీ తెలియదు.నిజానికి జగన్ ప్రభుత్వ బలమంతా దళిత మైనారిటీ ఓట్లలోను క్రైస్తవ ఓటింగ్ లోనే ఎక్కువ ఉంది .ఇది కాక జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వృద్దులు , మహిళలలో జగన్కు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నదన్నది పొలిటికల్ వర్గాల అంచనా మరలాంటప్పుడు యువత విద్యావంతులు కే పరిమితమైన ఎన్నికలలో లభించిన విజయాన్ని

పూర్తిస్థాయి రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా పరిగణలోకి తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పనలో జగన్ ప్రభుత్వం వెనుకబడిన విషయం అందరికీ తెలిసిందే అయితే భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం పై కొన్ని వర్గాల్లో అదే స్థాయిలో అభిమానం ఉంది.రాష్ట్ర అభివృద్ధి కన్నా తమ జీవితాల్ని, కుటుంబాల్ని ఆదుకుంటున్న కృతజ్ఞత వీరికి ఎక్కువ ఉంటుంది.అది ఎన్నికల్లో ప్రతిపలిస్తుంది కూడా.
మరి ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఒకటి రెండు వర్గాలకీ పరిమితమైన ఎన్నికల్లో విజయాన్ని చూసి మురిసిపోవడం వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా టిడిపి తీరు ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







