కోలీవుడ్ యంగ్ హీరో విశాల్( Vishal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఈయన తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నారు.
ఇక విశాల్ నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.ఇక ఈ మధ్యకాలంలో విశాల్ తన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
గత రెండు రోజులుగా ఈయన హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవమని విశాల్ ఖండించారు.ఇకపోతే తాజాగా ఈయన మార్క్ ఆంటోనీ( Mark Antony ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా ఈనెల 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఇందులో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య ( S.J Suriya )నటిస్తున్నారు.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విశాల్ ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగినటువంటి ప్రమాదం గురించి తెలియజేశారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు.చావు నుంచి తృతిలో తప్పించుకున్నానని ఆ భయం నుంచి తాను పదినిమిషాల పాటు తేరుకోలేకపోయానని తెలియజేశారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక యాక్షన్స్ సన్నివేశాన్ని పూర్తిచేసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పెద్ద ట్రక్ తన వైపు చాలా వేగంగా దూసుకు వచ్చింది అయితే దానిని గమనించిన నేను ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నాను.దీంతో ఆ ట్రక్ సెట్ ను ఢీకొనడంతో సెట్ మొత్తం కూలిపోయిందని తెలిపారు.అది చూసిన నాకు ఒక పది నిమిషాల పాటు నోట మాట రాలేదని ఈ ప్రమాదం నుంచి తాను బయటపడటం అంటే ఇది నాకు పునర్జన్మ లాంటిది అంటూ ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈయన పలు సినిమాలో షూటింగ్ సమయంలో ఇలా ఎన్నోసార్లు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.