చియాన్ విక్రమ్….24 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో అతడిని జనాలు గుర్తించిన పరిస్థితి ఉన్న రోజులు అవి.ఆకలి మీద ఉన్న పులిలా అతడి వేట కొనసాగుతూనే ఉంది.అలాంటి సమయంలోనే చాలామంది హీరోలు రిజెక్ట్ చేసిన తర్వాత ఒక కథ విక్రమ్ దగ్గరికి వచ్చింది.
ఆ సినిమా పేరు సేతు… దానికి దర్శకుడు బాల… అతనికి ఇదే తొలి చిత్రం కావడంతో ఎవరు నమ్మి బాలాజీ అవకాశం ఇవ్వలేదు కానీ కథ పైన పూర్తి విశ్వాసం ఉన్న విక్రమ్ సేతు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు.ఈ సినిమా కోసం విక్రమ్ పడిన కష్టాలు తెలిస్తే కళ్ళ వెంబడి కన్నీళ్లు మాత్రమే వస్తాయి.
సేతు సినిమాలో నటిస్తున్న సమయంలో విక్రమ్ ఆ చియాన్ పాత్రలో జీవించడం మొదలుపెట్టాడు.సినిమాలోని కాలేజ్ ఎపిసోడ్స్ మరియు ఫైట్స్ విక్రమ్ కి పెద్దగా కష్టం అనిపించలేదు కానీ సెకండ్ హాఫ్ లో మెంటల్ హాస్పిటల్ లో ఉన్న కొన్ని సీన్స్ కోసం బాల విక్రమ్ నీ బరువు తగ్గాలనే కండిషన్ పెట్టడంతో ఏకంగా 21 కేజీలు తగ్గాడు విక్రమ్.ఒక చపాతీ, ఒక గుడ్డు మరియు కాస్త క్యారెట్ జ్యూస్ మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు.ఈ సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతో విక్రమ్ గుండు కూడా కొట్టించుకున్నాడు.
హీరో పాత్ర కాస్త నల్లగా ఉండాలని దర్శకుడు చెప్పడంతో తన కలర్ తగ్గడం కోసం గంటకు గంటలు ఎండలో నిలుచుకునేవాడు.రోజు స్నానం చేసినప్పటికీ మాసపోయిన బట్టలను వేసుకునేవాడు.30 కిలోమీటర్ల దూరంలో ఉన్న షూటింగ్ లోకేషన్ కి కాలినడకన వెళ్లేవాడు.
మతిస్థిమితం లేని సమయంలో చేతులకి, కాళ్ళకి మెడలో ఇనప కడ్డీలు వేస్తే ఆ బరువు తట్టుకోలేక వంగిపోయేవాడు.అయినా కూడా ఎక్కడ కంటిన్యూటి మిస్ అవుతుందో అని వాటిని తీసేవాడు కాదు.రోజంతా అలాగే వేసుకొని ఉండడంతో ఒకరోజు కళ్ళు తిరిగి చెత్త కుప్పలో పడిపోయాడు.
ఇక నీరసంతో మాటిమాటికి బ్లాక్ అవుట్ అయిపోవడంతో సినిమా సెట్ లో ఎప్పుడూ ఒక డాక్టర్ని విక్రమ్ కోసం పెట్టే వారట.అలాగే బాల బార్య కూడా డాక్టర్ కావడంతో ఆమె కూడా ఎక్కువగా షూటింగ్ లోకేషన్ లోనే ఉండేవారట.
ఇన్ని కష్టాలు పడ్డా కూడా తర్వాత సినిమా కొనడానికి ఎవరు ముందుకు రాక కేవలం మౌత్ పబ్లిసిటీ తోనే ఈ చిత్రం ఘన విజయం సాధించింది.