అమ్మ జోక్యం చేసుకోవడం వల్లే తరుణ్ కెరీర్ నాశనం.. ఆయన ఏమన్నారంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన తరుణ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న తరుణ్ ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.

 Hero Tarun Comments About His Mother Involvement In Movies Details Here  ,  Moth-TeluguStop.com

తరుణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటుండగా తరుణ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తారో లేదో తెలియాల్సి ఉంది.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో తరుణ్ పేరు వినిపించగా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

అయితే అమ్మ జోక్యం చేసుకోవడం వల్లే తరుణ్ కెరీర్ నాశనమైందని జోరుగా ప్రచారం జరిగింది.కొంతమంది ఈ ప్రచారం నిజమేనని నమ్మారు.అయితే ఒక ఇంటర్వ్యూలో తరుణ్ మాట్లాడుతూ ఈ ప్రచారం గురించి క్లారిటీ ఇచ్చారు.నువ్వే కావాలి ట్రెండ్ సెట్టర్ అని ఆ సినిమాతో పోల్చుకుంటే అంతకు మించి సక్సెస్ సాధించడం తేలిక కాదని ఆయన అన్నారు.

నేను చేసిన సినిమాలలో బాగా ఇష్టపడి చేసిన మూవీ నువ్వే నువ్వే అని ఆయన తెలిపారు.

Telugu Mother, Nuva Nuva, Nuvve Kavali, Tarun, Tollywood-Movie

హెల్తీగా ఉంటే పోటీ ఉండటం గుడ్ అని ఆయన చెప్పుకొచ్చారు.తమిళంలో నేను నటించిన ఒక సినిమా హిట్టైనా ఎక్కువ సినిమాలు చేయాలని నేను అనుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.అమ్మతో సినిమాల గురించి మాట్లాడతానని అయితే సినిమాల ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం నాదేనని తరుణ్ తెలిపారు.

నేను రియల్ లైఫ్ లో ఎప్పుడూ ప్రేమలో పడలేదని తరుణ్ చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో రూమర్లు సాధారణం అని నాకు పెళ్లి అయిపోయిందనిరూమర్లు వచ్చాయని తరుణ్ తెలిపారు. నాకు ప్రేమ లేఖలు చాలా వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.యాక్టర్ కాకపోతే క్రికెట్ లో మంచి లెవెల్ కు వెళ్లేవాడినని తరుణ్ తెలిపారు.

జిమ్ అంటే నాకు అస్సలు నచ్చదని తరుణ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube