ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు, చారిత్రాత్మక సినిమాలతో మంచి మార్కెట్ సంపాదించుకుంటుంది టాలీవుడ్.
దీంతో తెలుగు సినీ పరిశ్రమకు ఇతర పరిశ్రమల నుండి మంచి పేరు వినిపిస్తుంది.ఈ నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ఇప్పటికే బాలీవుడ్ నటులు కన్నేశారు.
అంతేకాకుండా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా తమిళ హీరోలు కూడా తెలుగు మార్కెట్ పై బాగా ఆసక్తి చూపుతున్నారు.
చాలా వరకు తమిళ హీరోలు తెలుగు డబ్బింగ్ తో తెలుగు సినిమాలలో కనిపించారు.కానీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వలేదు.ఒకప్పటి స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ వంటి పలువురు నటులు కాకుండా ఈ తరానికి చెందిన నటులు ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదని తెలుసు.ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ కు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే.
ఇక విజయ్, విజయ్ ఆంటోని కూడా టాలీవుడ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.తాజాగా శివ కార్తికేయన్ టాలీవుడ్ కు అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

తమిళంలో ఈయన ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న తరుణంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వినిపించడంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.కీర్తి సురేష్ నటించిన రేమో సినిమా డబ్బింగ్ తో కొంతవరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.అంతేకానీ క్రేజ్ మాత్రం అందుకోలేకపోయాడు.ఇక ఈయనకు టాలీవుడ్ పరిచయం తక్కువగా ఉండటంతో ఇక్కడ అడుగు పెట్టి ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.