టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సంతోష్ శోభన్( Santosh Shoban ) జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అన్నీ మంచి శకునములే( Anni Manchi Shakunamule ) సినిమాతో సంతోష్ శోభన్ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.దాదాపుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో మహానటి, సీతారామం తర్వాత అదే బ్యానర్ నుంచి రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.నేను హీరో అయిన తర్వాత వైజయంతీ మూవీస్ నుంచి తొలి అడ్వాన్స్ అందుకున్నానని ఆయన తెలిపారు.
ప్రియాంక దత్ ఆ చెక్ ఇచ్చారని సంతోష్ శోభన్ చెప్పుకొచ్చారు.నందినీ రెడ్డి సినిమాలలో అలా మొదలైంది సినిమా చాలా ఇష్టమని సంతోష్ శోభన్ అన్నారు.
కొన్నిరోజుల క్రితం ఒక టీవీ షోలో అమ్మ గురించి అడిగారని ఆ సమయంలో నాకు మాటలు రాలేదని ఆయన కామెంట్లు చేశారు.అమ్మే నా సర్వస్వం అని సంతోష్ తెలిపారు.నేను సినిమాల్లో నటిస్తున్నందుకు అమ్మ సంతోషంగా ఉందని కెరీర్ తొలినాళ్ల నుంచి నేను దాటొచ్చిన ఎత్తుపల్లాలను అమ్మ స్వయంగా చూసిందని సంతోష్ శోభన్ పేర్కొన్నారు.కఠిన సమయాలలో అమ్మ అండగా నిలిచిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం పెద్ద సంస్థలలో నేను పని చేస్తుండటం అమ్మకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని సంతోష్ శోభన్ అన్నారు.అమ్మకు నాపై ఉండే నమ్మకం వల్లే నేను ఇన్ని సినిమాలలో నటించడం సాధ్యమవుతోందని ఆయన తెలిపారు.మాకు మొదటినుంచి సొంత ఇల్లు లేదని ఎప్పటికైనా అమ్మకు పెద్ద ఇల్లు కొనివ్వాలని ఉందని సంతోష్ శోభన్ వెల్లడించారు.