తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి( Rakshit Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈయన కేవలం కన్నడ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా నటించిన విషయం తెలిసిందే.
అతడే శ్రీమన్నారాయణ, ఛార్లీ 777, ఇటీవల సప్త సాగరాలు దాటి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యారు.రక్షిత్ శెట్టి కేవలం హీరో మాత్రమే కాదు డైరెక్టర్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
అలాగే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న రక్షిత్ తన సంస్థ ద్వారా కొన్ని మంచి సినిమాలు ఇచ్చాడు.ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ( Kannada Industry )లో అతనికి ఫుల్ డిమాండ్ ఉండడంతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు రక్షిత్ శెట్టి.
ఒక్కో సినిమాకే కోట్లలో రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.అయితే సినిమాల్లోకి రాక ముందు రక్షిత్ ఏం చేసేవాడు, ఎంత జీతం తీసుకున్నారు? లాంటి విషయాలు చాలా మందికి తెలియదు.మరి ఆ వివరాల్లోకి వెళితే.కాగా రక్షిత్ శెట్టి సినిమాల్లోకి రాకముందు ఒక ఐటీ కంపెనీలో( IT Company ) పనిచేసేవాడు.రక్షిత్ శెట్టి తొలి ఐటీ ఉద్యోగంలో మొదటి నెల జీతం 12 వేలు.అంతకు ముందు కూడా రక్షిత్ శెట్టి పని చేశాడు.
తన తండ్రి నిర్మాణ రంగంలో ఉన్నారు.చిన్న వయసులోనే కారు నడపడం నేర్చుకున్న రక్షిత్ శెట్టి తన తండ్రి పనిచేసే చోటికి సిమెంట్ బస్తాలను తీసుకెళ్లేవాడట.
నమ్ ఏరియల్ ఒండ్ దిన సినిమాలో రక్షిత్ శెట్టి చిన్న పాత్రలో నటించారు.
ఆ తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం తుగ్గక్.ఈ సినిమా ఫ్లాప్ అయింది.ఆ తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం సింపుల్ ఆగ్ వన్ లవ్ స్టోరీ.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రక్షిత్ శెట్టికి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.ఇది ఇలా ఉంటే ఇటీవలే సప్త సాగరాలు దాటి- సైడ్ ఏ( Sapta Sagaralu Dhaati ) సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు రక్షిత్ శెట్టి.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది.సప్త సాగరాలు దాటి- సైడ్ ఏ పేరుతో నవంబర్ మూడో వారంలో ఈ మూవీ విడుదల కానుంది.