యంగ్ హీరో నితిన్ కెరియర్ మళ్ళీ సందిగ్ధంలో పడ్డట్లు అయింది.ఆ మధ్య ఏకంగా ఆరు ఏడు సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్కటి కూడా చిన్న కమర్షియల్ సక్సెస్ దక్కించుకోలేక పోయిన నితిన్ చాలా కష్టాలు పడ్డాడు.
కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉన్న కారణంగా కెరియర్ ని నెట్టుకొచ్చాడు.ఇష్క్ సినిమా తో మళ్లీ గాడిలో పడ్డ నితిన్ ఇన్నాళ్లకు మళ్లీ కష్టాలను ఎదుర్కొంటున్నాడు.
మాచర్ల నియోజకవర్గం సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్న నితిన్ నిరాశ కు గురయ్యాడు.
ప్రేక్షకులు కూడా ఆ సినిమా తో తీవ్ర నిరాశ కు గురయ్యారు.అందుకే కచ్చితంగా నితిన్ తదుపరి సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేది అయ్యి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అదే ప్రయత్నం లో నితిన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మాచర్ల నియోజకవర్గం సినిమా కాస్త ఎక్కువగానే డ్యామేజ్ చేసిందేమో అందుకే నితిన్ తన తదుపరి సినిమా విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటూ ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీకి చెందిన కొందరు గుసగుసలాడుకుంటున్నారు.మాచర్ల నియోజకవర్గం సినిమా యొక్క కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మినిమం వసూలు కూడా నమోదు కాలేదు.ఒకప్పుడు నితిన్ అంటే మినిమం గ్యారెంటీ హీరో అన్నట్లుగా కొంత మంది మాట్లాడుకునేవారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మాచర్ల నియోజకవర్గం సినిమా కు దక్కిన కలెక్షన్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది.అందుకే మళ్ళీ మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్ సొంతం చేసుకోవడం కోసం నితిన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు.ఇలాంటి సమయంలో నితిన్ నటిస్తున్న సినిమా ఈ ఏడాదిలో ఉంటుందా లేదా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.







