'మాచర్ల నియోజకవర్గం' నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్: సక్సెస్ మీట్ లో హీరో నితిన్

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ భారీ మాస్ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది.శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలుగా, ఎమ్.

 Hero Nithin Macherla Niyojakavargam Movie Success Meet Deails, Hero Nithin, Mach-TeluguStop.com

ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.

తెలుగు ప్రేక్షకులకు చాలా పెద్ద థాంక్స్.నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు.

మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను, నా నమ్మకం ‘మాచర్ల నియోజకవర్గం’తో మరోసారి నిజమైయింది.చాలా కాలం తర్వాత నా జోనర్ ని మార్చి యాక్షన్ లోకి వెళ్లాను.

దిన్ని ప్రేక్షకులు అద్భుతంగా రీసివ్ చేసుకున్నారు.సినిమాని ఆడియన్స్ తో థియేటర్లో చూశాను.

యాక్షన్, కామెడీ సీన్స్ కి మీరు ఇచ్చే చప్పట్లు విజల్స్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి.

సినిమా రెవెన్యు చాలా బావుంది.

రెండో రోజు కూడా చాలా బలంగా వుందని చెబుతున్నారు.వెన్నెల కిషోర్ గారి కామెడీ, యాక్షన్ సీన్స్, నా లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.

కృతి శెట్టి, డీవోపీ ప్రసాద్ మురెళ్ళ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు.సాగర్ ఇచ్చిన పాటలు , నేపధ్యం సంగీతం సినిమాలో అద్భుతంగా వున్నాయి.

ఇలాంటి సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది.ఇలాగే కష్టపడుతూ ఇంకా మంచి సినిమాలు తీస్తాను.

సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.

Telugu Anjali, Nithin, Krithi Shetty, Nikhita Reddy, Saahi Suresh-Movie

కృతి శెట్టి మాట్లాడుతూ.తొలిరోజు రూ.10కోట్లు కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు.తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.లాంగ్ వీకెండ్ కూడా వుంది.మీ ఫ్యామిలీతో వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి.మాచర్ల ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

మా టీం అందరికీ థాంక్స్” అన్నారు.

నిఖిత రెడ్డి మాట్లాడుతూ.

‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ డే షేర్స్ అద్భుతంగా వున్నాయి.ఏపీ తెలంగాణలో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

నితిన్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్.పాండమిక్ తర్వాత ఈ స్థాయిలో ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా వుంది.

ప్రతి షోకి పాజిటివ్ టాక్ పెరుగుతూనే వుంది.దర్శకుడు శేఖర్, డీవోపీ ప్రసాద్ మురెళ్ళ, సంగీత దర్శకుడు సాగర్ బెస్ట్ వర్క్ ఇచ్చారు.

సినిమాని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు.

Telugu Anjali, Nithin, Krithi Shetty, Nikhita Reddy, Saahi Suresh-Movie

చిత్ర దర్శకుడు ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… మాచర్ల నియోజికవర్గంతో నితిన్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.సినిమాని థియేటర్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.కలెక్షన్స్ వైజ్ కూడా అద్భుతంగా వుంది.ఈ చిత్రానికి నాకు సపోర్ట్ చేసిన నిర్మాతలకు, టీంకు కృతజ్ఞతలు” తెలిపారు.

డీవోపీ ప్రసాద్ మురెళ్ళ మాట్లాడుతూ.

నిర్మాత సుధాకర్ రెడ్డిగారికి కృతజ్ఞతలు.మాకు కావాల్సింది సమకూర్చారు.

ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” తెలిపారు.

ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ .గొప్పగా సపోర్ట్ చేసిన నితిన్ అన్నకి థాంక్స్.అలాగే నిర్మాతలు సుధాకర్, నిఖితా, దర్శకుడు శేఖర్ గారికి కృతజ్ఞతలు.నా టీం కామేష్ , భార్గవ్, జగన్నాధమ్ , కార్తిక్ కు కృతజ్ఞతలు.” తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube