టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ నటించిన భీష్మ ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత నితిన్ నటించిన పలు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.
ఈ క్రమంలోనే నితిన్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుని సినిమాలు దూసుకుపోతున్నారు.ఇప్పటికే నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమానే కాకుండా, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక పొలిటికల్ కామెడీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకి జూనియర్ అనే టైటిల్ కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇకపోతే వక్కంతం వంశీ అల్లు అర్జున్ తో చేసిన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ద్వారా ఆయన తన టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ఎంతో కష్టపడుతున్నారు.నితిన్ కి జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీలా జంటగా నటిస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ సినిమాపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఈ సినిమా పై స్పందిస్తూ… ఏందయ్యా ఈ పొలిటికల్ కామెడీ సినిమాలు అంటూ ఎంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమా పై నితిన్ స్పందిస్తూ తనదైన శైలిలో నెటిజన్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చారు.ఇక ఈ విషయంపై నితిన్ స్పందిస్తూ.ఫేక్ రాజా చిల్ అవ్వు.గట్టిగా కొడదాం ఈ మూవీ.ట్వీట్ స్టోర్ చేస్కో.’ అని నితిన్ ట్వీట్ చేశాడు.నితిన్ ఈ విధంగా ఎంతో కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పడంతో చాలామంది వంశీ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొడతారని వారి అభిప్రాయాలను తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమాని ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.