గ్రామాన్ని దత్తత తీసుకొని మంచి మనసు చాటుకున్న కార్తికేయ 2 నిర్మాత?

ఈ ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ లాభాలను అందుకున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.

ఇలా తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలు కోట్ల రూపాయల లాభాలను తీసుకువచ్చాయి.

ఇకపోతే నిర్మాత అభిషేక్ అగర్వాల్ కరోనా సమయంలో ఎంతోమందికి ఎన్నో సహాయ సహకారాలను చేసి తన మంచి మనసు చాటుకున్నారు.ఈ క్రమంలోనే ఈయన మరోసారి తన మంచి మనసును బయటపెట్టారు.

ఈ రెండు సినిమాల ద్వారా అభిషేక్ అగర్వాల్ కి మంచి లాభాలు రావడంతో ఈయన ఏకంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ తిమ్మాపూర్ గ్రామం స్వయంగా కిషన్ రెడ్డి జన్మస్థలం కావడం విశేషం.ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి అభిషేక్ అగర్వాల్ మధ్య ఎంతో మంచి అనుబంధము ఉందని వీరిద్దరూ ఇదివరకు ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాలి.

Advertisement

ఇకపోతే అభిషేక్ అగర్వాల్ కుటుంబ సభ్యులు చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అభిషేక్ తండ్రి తేజ్ నారాయణ అగర్వాల్ 60వపుట్టినరోజు అలాగే తన అమ్మమ్మ చంద్రకళ 90వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అభిషేక్ అగర్వాల్ తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు.ఇలా అభిషేక్ అగర్వాల్ గ్రామాన్ని దద్దత తీసుకుంటున్న విషయాన్ని తెలియజేయడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు నెటిజన్ లు ఈయన గొప్ప నిర్ణయం పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు ఫౌండేషన్లను స్థాపించి పేద ప్రజలకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు