హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు యంగ్ హీరో నిఖిల్.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి నిఖిల్ అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
అయితే గత ఏడాది ఈయన కార్తికేయ 2 సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో నిఖిల్ కి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా తర్వాత ఈయన నటించిన 18 పేజెస్ సినిమా కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకుంది.

ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిఖిల్ సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే 18 పేజీస్ సినిమా తర్వాత ఈయన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నిఖిల్ కి ఓ అద్భుతమైన కథను వివరించారట.
ఇలా వివేక్ విభిన్నమైన లవ్ స్టోరీ నెరేట్ చేయడంతో ఈ కథ నిఖిల్ కు నచ్చగానే వెంటనే ఓకే చేశారని తెలుస్తోంది.

ఇలా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నిఖిల్ స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ కు కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తుంది.మొదటి హాఫ్ ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని అలాగే రొటీన్ కథలా అనిపించడంతో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేయాలంటూ నిఖిల్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు కొన్ని కండిషన్లు పెట్టారని తెలుస్తోంది.అయితే ఇందుకుగాను డైరెక్టర్ కి కొంత సమయం ఇచ్చారట.
మరి ఈ సమయంలో స్క్రిప్ట్ లో మార్పులు చేసే వివేక్ ఆత్రేయ నిఖిల్ ను మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.







