సినిమా ఇండస్ట్రీ లో నిలబడాలంటే సక్సెస్ ఒక్కటే మార్గం, ఎన్ని డబ్బులు ఉన్న అసలు ఏం లేకపోయినా ఇక్కడ మ్యాటర్ కాదు నీ టాలెంట్, నీకు ఉన్న హిట్స్ మాత్రమే ఇక్కడ మాట్లాడుతాయి.ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు కింగ్ నాగార్జున( Nagarjuna ) కొడుకు అయినా అఖిల్ ఈయన చేసిన సినిమాలు చాలానే ఉన్నప్పటికీ అవేమి పెద్దగా సక్సెస్ సాధించలేదు.
దాంతో అఖిల్ ఆశలు అన్ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఏజెంట్ సినిమా ( Agent movie ) పైనే ఉన్నాయి
ఈ సినిమా కనక ప్లాప్ అయితే ఇక అఖిల్( Akkineni akhil ) సినిమా కెరియర్ ని కాపాడే వాళ్ళు లేరు అనేలా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి… ప్రస్తుతం నాగార్జున అఖిల్ గురించి చాలా బాధపడుతున్నట్టు గా తెలుస్తుంది.అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం తనే మోస్తాడు అని అనుకుంటే, అఖిల్ ఇప్పుడు ఒక్క హిట్ కొట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడటం చూసిన నాగార్జున కి బాధేస్తుందని తెలుస్తుంది…
దీనికి తోడు అఖిల్ ఇప్పుడు చేస్తున్న ఏజెంట్ సినిమా కనక ప్లాప్ అయితే నెక్స్ట్ మనోడి పరిస్థితి ఏంటి అని ఇప్పటికే అఖిల్ మీద చాలా ట్రోల్ల్స్ వస్తున్నాయి.ఇలాంటి సందర్భం లో ఇప్పటికే రిలీజ్ అయినా ఏజెంట్ టీజర్ చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.దానికి తోడు ఈ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి కావడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది అనే ధీమాతో ఉన్నారు అక్కినేని అభిమానులు…
అయితే ఈ సినిమా తరువాత ఏ సినిమా చేయాలి అనే విషయం మీద అఖిల్ కి ఇంకా క్లారిటీ లేదు.ప్రస్తుతం అయితే ఈ సినిమా మీదే మొత్తం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది…ఈ సినిమా రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ చూసి నెక్స్ట్ సినిమా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు అఖిల్…చూడాలి మరి ఈ సినిమాతో అయిన అఖిల్ అనుకున్న హిట్ వస్తుదో,లేదో…
.