కళ్యాణ్‌ రామ్‌ కోపంగా ఉన్నాడా?

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించాడు.అయితే మొదటి సారి వేరే హీరోతో చేస్తోన్న సినిమా ‘కిక్‌`2’.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా గత నెలలోనే విడుదల కావాల్సి ఉంది.దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ రీ షూట్‌ చేయడంతో ఆలస్యం అయ్యింది.

అయితే ఇప్పుడు ‘కిక్‌`2’కు విడుదలకు సరైన తేదీ లేకుండా పోయింది.గత నెల మొత్తం చిన్న సినిమాలతోనే గడిచింది.

అనుకున్నట్లుగా గత నెలలో వస్తే మంచి ఫలితం దక్కేది.కాని ఇప్పుడు ముందుకు పోతే గొయ్యి, వెనక్కు వస్తే నుయ్యి అన్న తరహాలో ‘కిక్‌`2’ పరిస్థితి ఉంది.

Advertisement

జూన్‌ 26న విడుదల చేయాలని భావించిన కళ్యాణ్‌ రామ్‌కు అదే తేదీని తన సినిమా ‘రుద్రమదేవి’ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి గుణశేఖర్‌ షాక్‌ ఇచ్చాడు.దాంతో ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.26కు ముందే విడుదల చేద్దామా అంటే తక్కువ టైం ఉంది.ఇక ‘రుద్రమదేవి’ తర్వాత విడుదల చేసేందుకు ఇప్పటికే జులై నెలను ‘బాహుబలి’ మరియు ‘శ్రీమంతుడు’ సినిమాలు బ్లాక్‌ చేసుకున్నాయి.

దాంతో ఇప్పుడు ‘కిక్‌`2’ ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.దాదాపు రెండు నెలలు ఎదురు చూడాలి.దాంతో కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం దర్శకుడిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు