ఆ సినిమా నన్ను ఇండస్ట్రీలో కోలుకోలేని దెబ్బ కొట్టింది: కళ్యాణ్ రామ్

నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కళ్యాణ్ రామ్. బాల నటుడిగా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాలేవి లేవని చెప్పాలి.

 Hero Kalyan Ram About His Career Disaster Movie Om 3d Details,  Kalyan Ram,tolly-TeluguStop.com

అతనొక్కడే పటాస్ వంటి చిత్రాలు తప్ప మిగిలిన సినిమాలు మొత్తం ఈయనకు ఏ విధమైనటువంటి గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.ఇకపోతే చాలా సంవత్సరాలు తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే కళ్యాణ్ రామ్ మొదటి నుంచి కూడా ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.అయితే ఈ సినిమాలన్నీ ఆయనకు చేదు అనుభవాన్ని మాత్రమే మిగిల్చాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తాను నటించిన ఓం త్రి డీ అనే సినిమా చేశారు.

Telugu Atanokkade, Bimbisara, Kalyan Ram, Kalyanram, Nandamurikalyan, Om, Patas,

ఈ సినిమాపై నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించామని అయితే ఈ సినిమా ఆర్థికంగా తనని దెబ్బతీయటమే కాకుండా, తనని కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి వెల్లడించారు.ఈ సినిమా విషయంలో తాను చాలా బాధపడ్డానని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇకపోతే ప్రస్తుతం విడుదల కాబోతున్న బింబిసారా సినిమాపై తాను ఎంతో నమ్మకం పెట్టుకున్నానని ఈ సినిమా ప్రతి ఒక్కరిని సందడి చేస్తుందన్న నమ్మకంతో తాను ఉన్నానని ఈయన వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube