సినీ ప్రియులకు కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.నవ మన్మధుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ధనుష్ ఆ తర్వాత వచ్చిన రఘువరన్ బీటెక్ తో తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని ర్యాపో సొంతం చేసుకున్నాడు.
తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ధనుష్ క్రేజ్ మాత్రం టాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉంది.
ఇక కోలీవుడ్ లో ధనుష్ ని ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఆదరిస్తారు.
ఇక ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో పలు సినిమా ఆఫర్లు తన సొంతం చేసుకున్నాడు.ఇక ధనుష్ కెరీర్ పరంగా మూడు పూలు ఆరు కాయలులా ఉంది.
ప్రస్తుతం ఆయన ఖాతాలో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి.ఇదంతా పక్కన పెడితే.
ధనుష్ నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదం విషయంలో అంతగా ఓపెనింగ్స్ ను తెచ్చుకోలేకపోతున్నాయి.
ఇక ముందు ముందే ఆయన స్ట్రైట్ తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి.
అలాంటిది ఈ సమయంలో ఆయన తమిళ సినిమాను ముందస్తుగానే ప్రమోట్ చేసుకోవాల్సి ఉంది.కానీ ఎందుకో ఆయన తమిళ సినిమా తెలుగు అనువాదానికి సరైన పబ్లిసిటీ కనిపివ్వడం లేదు.
ఈ సినిమా ట్రైలర్ లో కూడా నిత్యమీనన్, రాశీ ఖన్నా, ప్రకాష్ రాజ్, తమిళ సీనియర్ దర్శకుడు భారతిరాజా కూడా ఒక ముఖ్యపాత్రను పోషించినట్టున్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ బాగా ఆసక్తిదాయకంగానే ఉంది.కానీ తెలుగులోకి అనువాదం మాత్రం అంత క్వాలిటీ లేదని తెలుస్తుంది.ప్రకాష్ రాజ్, నిత్యామీనన్ ల సీన్లలో డైలాగులను వారి స్వరాల్లో కాకుండా వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పారు.
ఇక తమిళంలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ బాగానే ఉన్నట్టుంది.తొలి రోజు దాదాపు సుమారు పది కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట ఈ సినిమా.

థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తమిళనాట ఇలా ఆకట్టుకుంటున్నప్పటికీ.తెలుగునాట మాత్రం ఏ మాత్రం సందడి చేయడం లేదని తెలుస్తుంది.అంటే ముందుగానే ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులో అంతగా సక్సెస్ కావడం లేదు అనుకోనే తెలుగులో అందుకే ప్రమోట్ చేయలేదు అని అనుమానాలు వస్తున్నాయి.తెలుగులో అటువంటి సక్సెస్ రాలేకున్న కూడా తెలుగు ఓటీటీ, టీవీ విడుదలల్లో ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందేమో అని ఆలోచనలు వస్తున్నాయి.
ఎందుకంటే తెలుగు ప్రేక్షకులలో ధనుష్ అభిమానులు ఉన్నారు కాబట్టి.ఇక దర్శకుడు మిత్రన్ ఇది వరకూ ధనుష్ తో మూడు సినిమాలను చేశాడు.
ఇక ఆ మూడూ తెలుగు సినిమా రీమేక్ లే.ఆర్య, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే, రెడీ వంటి సినిమాల తమిళ రీమేక్ లలో ధనుష్ నటించగా.వాటికి మిత్రన్ దర్శకత్వం వహించాడు.వీరి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.







