టాలీవుడ్ లెజెండ్స్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య?

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో అర్జున్ అంటే తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈయన తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

 Hero Arjun Daughter Aishwarya Took Blessings With Tollywood Legends, Hero Arjun,-TeluguStop.com

హీరోగా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ విలన్ గా కూడా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు.ఈ విధంగా హీరోగా విలన్ గా అందరిని మెప్పించిన అర్జున్ డైరెక్టర్ గా మారిపోయారు.

ఈ క్రమంలోనే ఈయన తొలిసారిగా డైరెక్టర్ గా మారి తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

అర్జున్ కుమార్తె ఐశ్వర్య, హీరో విశ్వక్ సేన్ ఇద్దరూ జంటగా ఈ సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పవన్ కళ్యాణ్ వంటి వారు హాజరయ్యారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా హైదరాబాదులో చిత్రీకరణ జరుపుకొనుంది.

ఈ క్రమంలోనే హైదరాబాదులో ఉన్నటువంటి ఐశ్వర్య, అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ ను కలిసి వారితో మాట్లాడి అనంతరం ఐశ్వర్య వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

కళాతపస్వి కె విశ్వనాథ్ గారిని కలిసిన ఆయనతో మాట్లాడిన అనంతరం వీరిద్దరూ కృష్ణ గారిని కూడా కలిసి తన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.ఇలా వీరిద్దరిని వేరువేరుగా కలిసిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలా మొదటిసారిగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇండస్ట్రీకి పరిచయం కావడం ఆ సినిమాని అర్జున్ డైరెక్ట్ చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube