టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బాగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇకపోతే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ( Sneha reddy )మనందరికీ సుపరిచితమే.స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.
అల్లు అర్జున్ భార్య గానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరుచుకుని స్నేహారెడ్డి.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపించడంతో పాటు గ్లామర్ ఫొటో షూట్స్ అభిమానుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
అలాగే తనని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది స్నేహ రెడ్డి.భర్త అల్లు అర్జున్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటే స్నేహరెడ్డి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తన భర్తకు పిల్లలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా స్నేహ రెడ్డి ఉగాది పండుగ ( Ugadi festival )సందర్భంగా ఉగాది వేడుకకు సంబంధించిన వీడియోని షేర్ చేసింది.
కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.
ఉగాది పచ్చడి ప్రత్యేకంగా తయారు చేసిన స్నేహారెడ్డి, పలు వంటకాలు చేశారు.అందులో పులిహోర, గారెలు, పాయసం వంటివి ఉన్నాయి.పూజ గదిని, ఇంటిని చక్కగా అలంకరించారు.
సాంప్రదాయ దుస్తుల్లో పిల్లలను రెడీ చేసింది.స్నేహారెడ్డి ఉగాది పండుగ అమ్మవాళ్ల ఇంట్లో జరుపుకున్నట్లున్నారు.
ఈ వీడియోలో స్నేహారెడ్డి పేరెంట్స్ మాత్రమే కనిపించారు.అల్లు అర్జున్ లేరు.
అయితే ఆ వీడియోలో అల్లు అర్జున్ కనిపించకపోవడంతో ఆయన ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాకపోయి ఉండవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.