ఎన్నో విభిన్నమైన సినిమాలకు దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు రవిరాజా పినిశెట్టి. అయన వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తూ అయన పెద్ద కుమారుడు ఆది పినిశెట్టి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇతడి అసలు పేరు సాయి ప్రదీప్ పినిశెట్టి. తేజ దర్శకత్వం లో ఒక ‘వి’చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం తో తనలోని నటుడికి పని చెప్పాడు ఆది.ఇక దర్శకుడు శంకర్ నిర్మాతగా మారి తీసిన ఈరం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.ఆది ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని కోరుకోలేదు.నటుడిగా తనను తాను మెరుగు పరుచుకోవాలనుకున్నాడు.
అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా, హీరో పాత్రా కాకపోయినా సరే తనకు స్కోప్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ చేసుకుంటూ వచ్చాడు.అందుకే 2006 నుంచి 2022 వరకు కేవలం 20 సినిమాల్లో మాత్రమే నటించాడు.
అందులో హీరో పాత్రలు చాల తక్కువ.కానీ ఆది లో మాత్రం ఒక విభిన్నమైన పాత్రలు చేయగల నటుడు ఉన్నాడు.
ఎక్కవ తమిళ సినిమాల్లోనే గుర్తింపు తెచ్చుకుంటున్న, తెలుగు లో సైతం ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే చేయడానికి సై అంటున్నాడు.ఇక ఆది నటిస్తున్న అధిక చిత్రాలు విజయాలను నమోదు చేయడం విశేషం.

ఇక తెలుగు లో నేరుగా చేసిన చిత్రాల్లో సరైనోడు సినిమా విలన్ గా అది కి మంచి గుర్తింపుని ఇచ్చింది.రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ కి అన్నగా,ఆది నటన చాల అద్భుతంగా ఉంటుంది.సినిమాకు ప్రాణ వాయువు లాంటి పాత్ర లో చక్కగా ఒదిగిపోయాడు.యూ టర్న్ సినిమాలో సైతం సమంత ను డామినేట్ చేయకుండా బ్యాలెన్సింగ్ గా నటించాడు.ఇలా ప్రతి సినిమాకు ఒక వేరియేషన్ చూపిస్తూ హీరోగా కన్నా కూడా నటుడిగా ఎదుగుతున్నాడు ఆది పినిశెట్టి.

తండ్రి లాగానే ఎంతో విభిన్నంగా ఆలోచిస్తున్నాడు.ఇక అయన వ్యక్తి గత జీవితం విషయానికి వస్తే మన బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రాని చెల్లెలు నిక్కీ గల్రాని తో ప్రేమలో పడి ఇటీవలే పల్లి చేసుకున్నాడు.ఇక ఆది తమ్ముడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకుడిగా మారాడు.2015 లో ఆది మరియు నిక్కీ హీరో హీరోయిన్స్ గా నటించిన యాగావారాయినుం నా కాక్క సినిమాకు కథ అందించి, దర్శకత్వం కూడా చేపట్టాడు.