కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” పాదయాత్ర హైదరాబాద్ కి చేరుకుంది.కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 3000 కిలోమీటర్లుకు పైగా నడుస్తూ ఉన్న రాహుల్ ఈ పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతున్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో అనేది కూడా ప్రజలకు తెలియజేస్తూ పలు హామీలు ఇస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో పాదయాత్రలో నడుస్తున్న రాహుల్ పురాణాపూల్ నుండి చార్మినార్ కి వెళ్లిన రాహుల్ చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం అఫ్జల్ గంజ్, గాంధీభవన్, అసెంబ్లీ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు రాహుల్ చేరుకోవడం జరిగింది.నెక్లెస్ రోడ్డు లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి మరి కాసేపట్లో రాహుల్ ప్రసంగించనున్నారు.
హైదరాబాద్ లో రాహుల్ “భారత్ జోడో” పాదయాత్రకి ప్రజల నుండి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది.మహిళలు మరియు యువకులు అన్ని వర్గాల ప్రజలు… రాహుల్ పాదయాత్రలో పాల్గొని అడుగులు వేస్తూ ఉన్నారు.