ఎన్టీఆర్ లైనప్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. నెట్టింట వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నిరీక్షించారు.

 Heres Some Clarity On Ntr Another Film With Director Vetrimaran Details, Jr Ntr,-TeluguStop.com

నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.అయితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయం ఎన్టీఆర్ ది ఒక్కడిదే కాదు.

అందుకే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అంతా ఈయన నెక్స్ట్ సినిమా ‘ఎన్టీఆర్ 30’ కోసమే ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.కానీ ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకున్న క్రమంలో ‘NTR30’ నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.

ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైనప్ లో మరొక ఇద్దరు డైరెక్టర్లు కూడా ఉన్నారు.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

ఇప్పటికే వీరి సినిమా అఫిషియల్ గా ప్రకటించారు.

Telugu Buchi Babu Sana, Jr Ntr, Koratala Siva, Ntr, Ntrvetrimaran, Prashanth Nee

అలాగే ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా తో కూడా ఎన్టీఆర్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.ఇలా ఈయన లైనప్ లో ఇద్దరు డైరెక్టర్లు ఉండగా మరొక డైరెక్టర్ కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు గత కొన్ని రోజుల నుండి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Telugu Buchi Babu Sana, Jr Ntr, Koratala Siva, Ntr, Ntrvetrimaran, Prashanth Nee

ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు హాట్ టాపిక్ గా చర్చించు కున్నారు.అయితే ఈ వార్తపై క్లారిటీ వచ్చింది.ఈ వార్తలో కొద్దిగా నిజం కూడా ఉందట.

వెట్రిమారన్ ఇటీవలే ఎన్టీఆర్ ను రెండు సార్లు కలిసాడని.ఒక స్టోరీ కూడా వినిపించాడని కానీ ఎన్టీఆర్ ఈ స్టోరీలో కొన్ని మార్పులు కోరారని.

అందుకోసం ఈ డైరెక్టర్ మరికొన్ని నెలలు సమయం తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.దీంతో ఈ కాంబో అయితే ఉంటుంది కానీ ఎప్పుడు అనేది తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube