ర్యాంసమ్వేర్‌ను ఈ టిప్స్‌తో నియంత్రించండి!

సైబర్‌ నేరగాళ్లు ఎన్నో వేషాలు మారుస్తూ మన పర్సనల్‌ డేటాను తస్కరించి.డబ్బు లేదా మనకు సంబంధించిన డేటాను ఇతరులకు విక్రయించడం ద్వారా భారీగా దోచుకుంటున్నారు.

 Here Is The 5 Tips To Prevent Ramsomware, Backup, Cyber Attacks, Malware, Rams-TeluguStop.com

ప్రస్తుతం ర్యాంసమ్వేర్‌ అనే ఓ మాల్వేర్‌ ద్వారా మన డేటా తస్కరణకు గురికాకుండా ఉండే చిట్కాలను చూద్దాం. ఈ ర్యాంసమ్వేర్‌ అనే మాల్వేర్‌ను మన పర్సనల్‌ డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేయడానికి ఉపయోగిస్తారు.

తద్వారా వారికి చాలా డబ్బు వస్తోంది.అందుకే వారు టార్గెట్‌ చేసిన సంస్థ నెట్‌వర్క్‌లోకి దీన్ని ప్రవేశపెట్టడానికి ప్రతి ఛాన్సును వాడుకుంటారు.

ఈ మెయిల్స్, టెక్ట్స్, ఇమేజెస్, వాయిస్‌ మెయిల్స్, నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ ద్వారా సంస్థ నెట్‌వర్క్‌లోకి ప్రవేశిస్తుంది.తద్వారా వ్యాపించి దానికి కావాల్సిన డేటాను కోరుతుంది.

ఎన్‌క్రిప్ట్‌ అయి డేటా దొరికిన తర్వాత సైబర్‌ నేరగాళ్లు మాల్వేర్‌ను యాక్టివేట్‌ చేస్తారు.ఆ తర్వాత మీ బిజినెస్‌ కార్యకలాపాలు నిర్వహించలేకపోతారు.

ఇటీవలి పరిశోధనల ద్వారా తెలిసిందేమిటంటే హ్యాకర్లు ఎక్కువ శాతం క్రిప్టోకరెన్సీని ర్యాంసమ్వేర్‌ దాడిలో ఉపయోగిస్తున్నారట.ఎందుకంటే పేరుగుతున్న బిట్‌కాయిన్‌ డిమాండ్‌ నేపథ్యంలో ఇది గత నష్టం కంటే కంపెనీకి ఎక్కువ నష్టాన్ని కూడా కలిగిస్తుంది.

ఎందుకంటే క్రిప్టోకరెన్సీ ధర పెరగటం వల్ల సంస్థ కూడా ఎక్కువ చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అందుకే సంస్థలకు అనుమానాస్పద లాగిన్‌లు లేదా కాంప్రోమైజ్డ్‌ ఖాతాలను వెంటనే గుర్తించగలిగి అలర్ట్‌ అవుతేనే డేటా భద్రంగా.

అడ్వాన్స్‌ టెక్నాలజీ

ర్యాంసమ్వేర్‌ దాడి కోసం పిషింగ్‌ను ఓ ప్రాథమిక టూల్‌.సంస్థలు ఈ దాడుల నుంచి రక్షణ పొందాలంటే.

ర్యాంసమ్వేర్‌ పంపించే బెదిరింపు ఈమెయిల్స్, హానికరమైనæవెబ్‌ యాప్స్,ట్రెడిష్‌నల్‌ ఈమెయిల్‌ గేట్‌వేలు చూడలేని మెయిల్‌ను సంస్థలు గుర్తించడానికి బహుళ స్థాయిలో భద్రతా పరిష్కారాలను ఏర్నాటు చేసుకోవాలి.

మీకు మీరు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి

Telugu Backup, Cyber, Malware-Latest News - Telugu

ఇలాంటి ట్రిక్స్‌ బారిన పడకుండా ఉండటానికి సంస్థలు వారి అధికారిక పత్రాలను రక్షణకు దృష్టిసారించాలి.దీనికి రెండు టూల్స్‌ అవసరం.మొదటిది గుర్తించటం, తక్షణం అలర్ట్‌ చేసే టూల్స్‌పై పెట్టుబడి పెట్టుకోవాలి.ఉద్యోగులకు కూడా దీనిపై తగిన ట్రైనింగ్‌ ఇవ్వాలి.

భద్రమైన వెబ్‌ అప్లికేషన్స్‌.

సైబర్‌ అటాకర్లు ముఖ్యంగా వెబ్‌ ఫాం, ఫైల్‌ షేరింగ్‌ సేవలు, ఈ కామర్స్‌ సైట్స్‌పై యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ లేదా ఏపీఐ ఇంటర్‌ ఫేస్‌ ద్వారా దాడి చేస్తారు.దీనికి ఆ యాప్స్‌ లొంగుతే ఇక నేరగాళ్లు ర్యాంసమ్వేర్‌ను ఇతర మాల్వేర్‌లను సులభంగా ప్రవేశపెడతారు.

Telugu Backup, Cyber, Malware-Latest News - Telugu

డేటా బ్యాకప్‌

ముఖ్యంగా డేటా లొకేషన్‌పై అవగాహన కలిగి ఉండాలి.ఇందులో యూజర్‌ డాక్యుమెంట్లు, ఉద్యోగులు, క్లయింట్స్‌ ఇతర ఆర్కీవ్‌ చేసిన ముఖ్య డేటా అన్నింటినీ బ్యాకప్‌ చేస్తూండాలి.తరచూ ఉపయోగించే డేటాను రోజులో కనీసం ఒకసారైనా బ్యాకప్‌ చేసుకోవాలి.

ఉద్యోగులకు అవగాహన

అప్డేటెడ్‌ కంప్యూటర్‌ ఆధారిత సెక్యూరిటీపై ఉద్యోగులకు శిక్షణ అందించాల్సిన అవసరం ఉంటుంది.దీంతో దాడులను గుర్తించడం సులభతరం అవుతుంది.ఒకవేళ సైటర్‌ దాడికి గురి అయినా పరిస్థితి ఏర్పడితే.ఉద్యోగులకు ఎవరిని తక్షణమే సంప్రదించాలన్న అవగాహన కలిగి ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube