ప్రపంచ బ్యాంకు ప్రకారం, 2023లో 125 బిలియన్ డాలర్లతో భారతదేశం అత్యధిక రెమిటెన్స్‌లను అందుకుంది.అయితే, భారతదేశానికి డబ్బు పంపడం ఖర్చుతో కూడుకున్నది, ముఖ్యంగా బ్యాంకుల ద్వారా.వాస్తవానికి బ్యాంకుల నుంచి కాకుండా విదేశాలల్లో నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశానికి డబ్బును పంపడానికి వివిధ మార్గాలు ఉన్నాయి, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
• NRE ఖాతా
ప్రవాస భారతీయులు (NRIs) విదేశీ కరెన్సీని డిపాజిట్ చేయడానికి NRE అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, ఈ అకౌంట్‌లో డిపాజిట్ చేసిన ఫారిన్ కరెన్సీ భారతీయ రూపాయికి మార్చబడుతుంది.NRE ఖాతాని రూపాయిలలో మరొక భారతీయ ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించవచ్చు.NRE ఖాతా సేవింగ్స్, కరెంట్, రికరింగ్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వివిధ రకాలుగా ఉండవచ్చు.
NRE ఖాతాపై అసలు లేదా వడ్డీపై ఎలాంటి పన్ను వసూల్ చేయరు.NRE ఖాతాను ఇండివిడ్యువల్‌గా లేదా జాయింట్‌గా తెరవవచ్చు.

• వెస్ట్రన్ యూనియన్
భారతదేశానికి డబ్బు పంపడానికి వెస్ట్రన్ యూనియన్( Western Union ) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించవచ్చు.మీరు భారతదేశాన్ని గమ్యస్థానంగా ఎంచుకుని, అమౌంట్ ఎంటర్ చేసి, డెబిట్/క్రెడిట్ కార్డ్‌తో చెల్లించి, రిసీవర్ వివరాలను అందించాలి.రిసీవర్ భారతదేశంలోని ఏదైనా వెస్ట్రన్ యూనియన్ అవుట్‌లెట్ నుంచి డబ్బును నగదు రూపంలో సేకరించవచ్చు.

• ఫిన్‌టెక్ యాప్‌లు
భారతదేశానికి డబ్బును పంపడానికి Revolut, మనీగ్రామ్ వంటి ఫిన్‌టెక్ యాప్‌లను( Fintech Apps ) కూడా ఉపయోగించవచ్చు.ఈ యాప్‌లు వేగవంతమైన, అంతరాయాలు లేని క్రాస్-బోర్డర్ డబ్బు బదిలీలను అందిస్తాయి.అయితే ఈ యాప్‌లు సేవ కోసం స్మాల్ ఫీజు వసూలు చేస్తారు.

• బ్యాంకు బదిలీ
మీకు విదేశీ బ్యాంకు ఖాతా ఉంటే, నెట్ బ్యాంకింగ్( Net Banking ) ద్వారా ఇండియన్ అకౌంట్‌కు డబ్బును పంపవచ్చు.ఇది అంతర్జాతీయంగా డబ్బును బదిలీ చేయడానికి సులభమైన మెథడ్ కానీ ఖరీదైన పద్ధతి.







