Hebha Patel : బురఖాలో కనిపించి షాకిచ్చిన రాజ్ తరుణ్ హీరోయిన్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ( Hebba Patel )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రాజ్ తరుణ్ ( Raj Tarun )హీరోగా నటించిన మొదట కుమారి 21 ఎఫ్ సినిమా( Kumari 21 F Movie )తో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది.తన అందం,అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

యూత్ ని కట్టిపడేసింది.కాగా ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

కాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో కుమారి 21ఎఫ్ తో పాటు ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్.ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

ఆ ఫోటోలను చూసిన చాలామంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో హెబ్బా పటేల్ బురఖా( Hebba Patel Burkha ) ధరించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఆ ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఫోటోలను చూసిన చాలామంది అసలు హెబ్బా పటేల్‌ మతం ఏంటి అని గూగుల్‌లో తెగ సెర్చ్‌ చేయగా హెబ్బా ముస్లిమే.కన్నడ మాట్లాడే ముస్లిం.కానీ ఆమె పేరులో పటేల్‌ ఉండటంతో చాలా మంది ఆమె గుజరాతీ హిందువుని అనుకుంటూ ఉంటారు.

ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా తక్కువగా నిలుస్తోంది.అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన సినిమాల అప్డేట్ కూడా ఏమీ లేదు.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు