సాధారణంగా సినిమా ఇండస్ట్రీ( Movie Industry )లో హీరో హీరోయిన్లు ఇప్పుడు షూటింగ్ లు సినిమాలు అనే కాకుండా అప్పుడప్పుడు పబ్బులు పార్టీలు వెకేషన్ లు అంటూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.కూల్ గా చిల్ అవ్వడానికి పార్టీలు పబ్స్ వంటి వాటితో సేద తీరుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు హీరో హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
తాజాగా కూడా తన స్నేహితులతో కలిసి ఒక పార్టీకి వెళ్లిన ఒక నటికీ అలాంటి చేదు అనుభవమే ఒకటి ఎదురయ్యింది.

ఆ నటి ఎవరు? అసలు ఏం జరిగింది?ఆ వివరాల్లోకి వెళితే. కోలీవుడ్( Kollywood )లో మొదట బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ షాలు షమ్ము( Shalu Shammu ).వాలిబర్ సంగం, సకలకళ వల్లవన్, తమిళుకు నంబర్ వన్ ప్రెస్, మిస్టర్ లోకల్, సెకండ్ కుట్టు, రెక్క వంటి పలు సినిమాలలో నటించింది నటి షాలు షమ్ము.
షాలు షమ్ము సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా( Social Media )లో షేర్ చేస్తూ ఉంటుంది.కాగా ఈమెకు ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురయ్యింది.
ఈ నెల 9న చెన్నైలోని ఒక పార్టీలో పాల్గొందట.

పార్టీ తర్వాత ఆమె స్నేహితురాలి ఇంట్లో బస చేసి మరుసటి రోజు ఉదయం లేచే సరికి షాలు సెల్ కనిపించలేదట.దాంతో పార్టీ జరిగిన స్టార్ హోటల్‌కు వెళ్లి తన ఫోన్ పోయిందని చెప్పిందట.రెండు నెలల క్రితం 2 లక్షల రూపాయల విలువైన ఐఫోన్‌ను కొనుగోలు చేయగా ఆ ఫోన్ కనిపించలేదు.
హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీ( CCTV Footage )లను పరిశీలించగా ఎవరూ సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లినట్లుగా ఎలాంటి దృశ్యాలు కనిపించక పోవడంతో, మొబైల్ ఫోన్( Mobile Phone ) అదృశ్యంపై పట్టినప్పక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు( Police Complaint ) చేసిందట.అందులో తనతో పార్టీలో పాల్గొన్న స్నేహితులపై కూడా అనుమానం వ్యక్తం చేసింది.
షాలు షమ్ము ఫిర్యాదుతో ఆమె స్నేహితులను పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు.నటి షాలు షమ్ము సెల్ ఫోన్ మాయమవ్వడమే కాకుండా, ఆమె స్నేహితులపై ఫిర్యాదు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.







