హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
హైకోర్టు ప్రాంతంతో పాటు నాంపల్లి, అబిడ్స్ ఏరియాల్లో వడగండ్ల వాన పడుతోంది.మరోవైపు హిమాయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది.
మరికొన్ని చోట్ల వాతావరణం చల్లగా మారింది.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేసింది.







