ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత్ - బంగ్లా క్రికెటర్ల మధ్య గొడవ..!

ఎమర్జింగ్ ఆసియా కప్ ( Emeging Asia Cup ) శ్రీలంక వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా శుక్రవారం యువ భారత జట్టు- బంగ్లాదేశ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో 51 పరుగుల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది.

ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్( Ind vs Pak ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.అయితే తాజాగా జరిగిన మ్యాచ్లో భారత్-ఎ, బంగ్లాదేశ్-ఎ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది.

ప్రస్తుతం ఆ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.

భారత జట్టు బౌలర్ యువరాజ్ సిన్హ్ దోడియా బౌలింగ్లో బంగ్లా బ్యాటర్ సౌమ్య సర్కార్( Soumya Sarkar ) భారీ షార్ట్ ఆడే ప్రయత్నం చేసి నికిన్ జోస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.ఆ సందర్భంలో భారత ఆటగాళ్లు కాస్త సందడి చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఇప్పుడు బంగ్లా ఆటగాడైన సౌమ్య సర్కార్ కు.భారత ఆటగాడైన హర్షిత్ రాణా కు ( Harsith Rana ) మధ్య గొడవ జరిగింది.ఇద్దరి మధ్య మామూలుగా మాటకు మాట పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

Advertisement

వెంటనే అంపైర్, ఇతర ఆటగాళ్లు కలుగజేసుకొని వెంటనే గొడవను సద్దు మణిగిపించారు.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్- ఎ జట్టు 49.1 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్- ఎ 34.2 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది.దీంతో భారత జట్టు 51 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఆదివారం కొలంబో వేదికగా భారత్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు