టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ లో రోహిత్ రెడ్డి నలుగురిని ప్రతివాదులుగా చేర్చారు.ప్రతివాదులుగా కేంద్రంతో పాటు ఈడీ, ఈడీ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు.
ఈ క్రమంలో తనపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని రోహిత్ రెడ్డి పిటిషన్ లో కోరారు.తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.