మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.తన భార్యకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిసోడియా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేసింది.కాగా మనీ లాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే బెయిల్ కోసం ఎన్ని సార్లు కోర్టు మెట్లు ఎక్కినా సిసోడియాకు ఊరట లభించలేదు.







