బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్( Delhi Liquor Policy Money Laundering ) కేసులో గత నెల 26న మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు.తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు ఈడీని వివరణ కోరిన విషయం తెలిసిందే.అయితే కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో పిటిషన్ ను విచారించనున్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.