నేడు ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ
TeluguStop.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.
ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది.ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్( Delhi Liquor Policy Money Laundering ) కేసులో గత నెల 26న మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు.
తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
"""/" /
అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు ఈడీని వివరణ కోరిన విషయం తెలిసిందే.
అయితే కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పిటిషన్ ను విచారించనున్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అమ్మ ఫ్రైస్‌ను క్యూట్‌గా దొంగిలించిన బుడ్డోడు.. నవ్వులు పూయించే వీడియో వైరల్!