మునగాకు( Moringa Leaves ).ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆకుకూరల్లో ఒకటి.
మునగాకు 300 రోగాలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.అందుకే చాలా మంది మునగాకుని తమ డైట్ లో చేర్చుకుంటారు.
ముఖ్యంగా మునగాకుతో టీ తయారు చేసుకుని నిత్యం తీసుకుంటారు.అయితే మునగాకు టీ ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ప్రధానంగా మొటిమలు, మచ్చలను( Pimples , scars ) తరిమి కొట్టడానికి మునగాకు టీ సూపర్ ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ మునగాకు టీ ను చర్మానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అయ్యాక అందులో అర కప్పు ఫ్రెష్ మునగాకు, అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసుకుని కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత తయారు చేసుకున్న మునగాకు టీను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్( Aloe vera gel, rose water ) మరియు అరకప్పు మునగాకు టీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా ఒక మంచి సీరం సిద్ధమవుతుంది.
ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకుని ఆపై తయారు చేసిన సీరం ను ముఖానికి అప్లై చేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి.
చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో తయారుచేసిన ఈ సీరం చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది.
నిత్యం ఈ సీరం ను వాడడం వల్ల ముఖంపై మొండి మొటిమలు దూరం అవుతాయి.ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయమవుతాయి.కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి మొటిమలు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.