ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరిగింది.తన చిన్న కుమారుడి పరీక్షల నిమిత్తం కవిత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.

 Hearing On Mlc Kavitha Interim Bail Petition Details, Brs Mlc Kavitha, Interim B-TeluguStop.com

ఈ క్రమంలో కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.ఏప్రిల్ 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని చెప్పారు.

తన కుమారుడికి కవిత మద్ధతుగా ఉండేందుకు బెయిల్ ఇవ్వాలన్న న్యాయవాది సింఘ్వి కవిత అరెస్టుతో కుమారుడు మానసికంగా కుంగిపోయారని తెలిపారు.ఈ క్రమంలో పరీక్షలకు గైర్హాజరు అయ్యే అవకాశం ఉందన్నారు.

పరీక్షల సందర్భంగా తల్లి మద్ధతు పిల్లలకు అవసరమని ఆయన కోర్టుకు తెలిపారు.

షరతులతో కూడిన బెయిల్ కు తమకు అభ్యంతరం లేదని సింఘ్వి పేర్కొన్నారు.మరోవైపు ఎమ్మెల్సీ కవితకు బెయిల్( MLC Kavitha Bail ) ఇవ్వొద్దని ఈడీ వాదనలు వినిపించింది.అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదన్న ఈడీ తరపు న్యాయవాది కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

కవిత సెల్ ఫోన్లను మార్చారని, సమాచారాన్ని డిలీట్ చేశారని పేర్కొన్నారు.లిక్కర్ వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా ఉందని ఈడీ చెప్పింది.ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో( Liquor Case ) కవిత పాత్రప దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.ఇటువంటి సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కేసు విచారణకు ఆటంకమని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube