ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ పిటిష‌న్‎పై విచార‌ణ వాయిదా

ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ పిటిష‌న్‎పై ఏపీ హైకోర్టు విచార‌ణ జ‌రిపింది.

మాజీ డ్రైవ‌ర్ సుబ్రహ్మ‌ణ్యం హ‌త్య కేసులో జైలు జీవితం గ‌డుపుతున్న అనంత‌బాబు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు.

ఈ క్ర‌మంలో పిటిష‌న్‎పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం విచార‌ణ‌ను వ‌చ్చే బుధ‌వారానికి వాయిదా వేసింది.ఇటీవ‌లే అనంత‌బాబు త‌ల్లి మ‌ర‌ణించ‌డంతో.

Hearing On MLC Anantha Babu's Bail Petition Adjourned-ఎమ్మెల్స�

అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనేందుకు మ‌ధ్యంత‌ర బెయిల్‎పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.ముందుగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు 3 రోజులు బెయిల్ మంజూరు చేయ‌గా.

దానిపై అనంతబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు.ఈ నేప‌థ్యంలో బెయిల్‎ను మ‌రో ప‌ద‌కొండు రోజుల పాటు పొడిగిస్తూ గ‌త నెల‌లో ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

ఈ క్ర‌మంలో ఆయ‌న బెయిల్ గ‌డువు ముగియ‌డం, రెగ్యుల‌ర్ బెయిల్‎పై విచార‌ణ వాయిదా వేయ‌డంతో అనంత‌బాబు రాజ‌మహేంద్ర‌వ‌రం జైలులో లొంగిపోయారు.

చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..
Advertisement

తాజా వార్తలు